News October 22, 2025

అల్పపీడన ప్రభావంతో హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత..!

image

అల్పపీడన ప్రభావంతో హంసలదీవి బీచ్ గేట్లు మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సముద్రపు అలలు ఎగిసిపడుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపటి నుంచి రెండు రోజులు పాటు పాలకాయతిప్ప వద్ద ఉన్న హంసలదీవి బీచ్ గేట్లు మూసివేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News October 24, 2025

స్లీపర్ బస్సులు బ్యాన్ చేయాలా?

image

AP: కర్నూలు బస్సు <<18088805>>ప్రమాద<<>> ఘటనతో స్లీపర్ బస్సుల్లో సేఫ్టీపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. 8-9 అడుగుల ఎత్తు, సీట్ల మధ్య ఇరుకుగా ఉండటంతో ఎమర్జెన్సీ సమయంలో బయటికెళ్లడం కష్టమై ప్రాణనష్టం పెరుగుతోంది. వందలాది మంది మరణిస్తుండటంతో చైనా 2012లోనే స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. మన దేశంలోనూ నిషేధించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?

News October 24, 2025

బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు: SP

image

బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరించారు. చంద్రగిరి సబ్ డివిజన్ MR.పల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు.

News October 24, 2025

MDK: బంగారంపై చిగురిస్తున్న ఆశలు..!

image

కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరిగి ఆకాశాన్ని అంటాయి. రెండు రోజుల క్రితం బంగారం ధర రూ.1,33,000 ఉండగా ప్రస్తుతం ఒక్క రోజే రూ.5 వేలు తగ్గింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులు బంగారం ధర తగ్గాలని ఎదురుచూస్తుండగా రూ.5 వేలు తగ్గడంతో కొంత వరకైనా మేలని అంటున్నారు.