News August 28, 2025

అల్లర్లు రేకెత్తించే పాటలు పెడితే చర్యలు: ఎస్పీ

image

వినాయక విగ్రహ నిమజ్జన సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి అన్నారు. గురువారం వినాయక కమిటీ సభ్యులకు ఆయన తగు సూచనలు చేశారు. నిమజ్జన సమయాలలో డీజే, అసభ్యకర నృత్య ప్రదర్శనలు, అల్లర్లు సృష్టించే పాటలు పెట్టరాదన్నారు. పోలీస్ శాఖ వారు సూచించిన సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే వినాయక నిమజ్జనాలు నిర్వహించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News August 29, 2025

ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

image

టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) డైరెక్టర్ శ్రీహరి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 22-28 వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30-సా.5.30 గంటల వరకు ఉండనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 13 వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 29, 2025

అర్హులకు పెన్షన్ అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేయాలని కలెక్టర్ వెంకట మురళి పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక కలెక్టరేట్‌లో వీక్షణ సమావేశం నిర్వహించి అర్హులకు పెన్షన్లు అందించాలన్నారు.

News August 29, 2025

ప్రకాశం: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్!

image

ప్రకాశం జిల్లాలో మెగా డీఎస్సీలో PHC కేటగిరి కింద ఎంపికైన అభ్యర్థులకు ఒంగోలు చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న సరస్వతి జూనియర్ కళాశాలలో దరఖాస్తుల పరిశీలన నిర్వహిస్తామని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు తమ దివ్యాంగత్వం ధ్రువీకరణ పత్రాలతో ఒంగోలు జీజీహెచ్, పీహెచ్సీహెచ్1 పత్రాలు కలిగిన విశాఖపట్నం ENT వైద్యశాలకు శుక్రవారం వెళ్లాలని కోరారు.