News April 8, 2025
అల్లవరం: తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక వివాహిత సూసైడ్

10 నెలల క్రితం పెళ్లయిన అల్లవరం మండలం తూర్పులంకకు చెందిన ప్రవీణ (27) తల్లితండ్రులను విడిచి గుజరాత్ వెళ్లడం ఇష్టం లేక సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసామని ఎస్సై తిరుమలరావు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రవీణ నెల రోజుల క్రితం గుజరాత్‌లో ఉంటున్న భర్త వద్ద నుంచి స్వగ్రామం వచ్చింది. కోలుకున్న ఆమె మళ్లీ గుజరాత్ వెళ్లడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
Similar News
News September 16, 2025
రేపు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుండగా, 10.05 గంటలకు గౌరవ వందనం ఉంటుందన్నారు. అనంతరం ప్రసంగం చేస్తారని చెప్పారు.
News September 16, 2025
మంచిర్యాలలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు

మంచిర్యాలలో గోదావరి పుష్కరాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎమ్మార్వో రపతుల్లా హుస్సేన్, ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్ రావు మంగళవారం పర్యటించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి గోదావరి నది తీరం వరకు రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం పుష్కర ఘాట్‌లను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News September 16, 2025
మెదక్: అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం

మెదక్ జిల్లాలో అత్యధికంగా రేగోడ్‌లో 12.5 సెంమీల వర్షం కురిసింది. సోమవారం రాత్రి కుండపోత మాదిరిగా వర్షం కురవడంతో మెదక్ పట్టణం చెరువును తలపించింది. కాగా జిల్లాలో పలు చోట్ల ఉదయం 8 గంటల వరకు వర్షపాత వివరాలు.. మినుపూర్ 108 మిమీ, కొల్చారంలో 102 మిమీ, మెదక్ పట్టణంలో 71 మిమీ, లింగాయిపల్లిలో 71 మిమీ, టేక్మాల్ 59.5 మిమీ వర్షం కురిసింది.