News March 23, 2024

అల్లవరం: వడదెబ్బతో టాటా ఉద్యోగి మృతి 

image

అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ అన్‌షోర్ టెర్మినల్‌లో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటరమణారావు(55) శనివారం వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబీకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. టాటా సంస్థలో స్టోర్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న రమణారావు కి.మీ దూరం నడిచి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్నారు. బెండమూర్లంక పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందారన్నారు.

Similar News

News February 6, 2025

తూ.గో జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) 2025 సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పి. గిరి ప్రసాద్ వర్మ, జిల్లా అధ్యక్షుడు సీహెచ్. విల్సన్ పాల్, జిల్లా కార్యదర్శి, పలువురు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

News February 5, 2025

రాజమండ్రి: ఇంటర్, 10వ తరగతి పరీక్షలపై కలెక్టర్ సమావేశం

image

తూ.గో జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 43,754 మంది 51 పరీక్షా కేంద్రాల్లో, 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

News February 5, 2025

పందలపాక హత్య కేసులో నిందితుడి తల్లి అరెస్ట్

image

బిక్కవోలు మండలం పందలపాకలో గత నెల 29న హత్యకు గురైన లలితేశ్వరి కేసులో నిందితుడు తల్లి గుంతికోలు వరలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లుగా విచారణలో తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనపర్తి సీఐ సుమంత్ తెలిపారు. వరలక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ లలితేశ్వరిని కేబుల్ వైర్ మెడకు బిగించి చంపిన సంగతి విదితమే. ఈ హత్యలో మరికొందరి పాత్ర ఉందని గ్రామ మహిళలు ఇటీవల ఆందోళన చేశారు.

error: Content is protected !!