News September 9, 2025

అల్లు అర్జున్‌కి షాక్.. నోటీసులు ఇచ్చిన GHMC

image

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని అల్లు బిజినెస్ పార్క్ భవనం మీద అదనపు అంతస్తు నిర్మించారంటూ GHMC అధికారులు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. అనుమతి లేకుండా నిర్మించిన ఐదో అంతస్తు ఎందుకు కూల్చోద్దంటూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రెండేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంపైన ఇటీవల అక్రమంగా నిర్మించిన విషయంపై ఫిర్యాదు రావడంతో అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Similar News

News September 9, 2025

బాలాపూర్ గణేశ్ హుండీ ఆదాయం ఎంతంటే!

image

బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల హుండీని సోమవారం లెక్కించారు. తొమ్మిది రోజులపాటు భక్తులు రూ.23,13,760 కానుకలు సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. 9 రోజులు లక్షలాది భక్తులు గణపయ్యను దర్శించుకున్నట్లు వివరించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పోలీసు శాఖ, స్వచ్ఛంద కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

News September 8, 2025

ప్రజలిచ్చే అర్జీలపై సత్వరమే స్పందించాలి: HYD కలెక్టర్

image

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు అందచేసిన అర్జీలపై సత్వరమే అధికారులు స్పందించాలని HYD కలెక్టర్ హ‌రిచంద‌న అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రజావాణిలో అద‌న‌పు క‌లెక్ట‌ర్లు ముకుంద రెడ్డి, క‌దిర‌వ‌న్ ప‌ల‌ని తో కలసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన ద‌ర‌ఖాస్తుల‌ను అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు.

News September 8, 2025

ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం.. ఇది గమనించారా?

image

సాధారణంగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం తర్వాత కొంతభాగం నీటిలో పైకి కన్పిస్తుంటుంది. అయితే ఈసారి బడా గణేశుడు పూర్తిగా నీటిలో నిమజ్జనమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శనివారం నిమజ్జనానికి వచ్చిన భక్తులు ఆ భారీ గణనాథుడు కన్పిస్తాడేమోనని క్రేన్ నం.4 వద్ద ఇలా బారులు తీరారు. అయితే అక్కడ మండపంలో గణపయ్యకు వేసిన భారీ పూలదండ ఆకారం కన్పించడంతో దానిని వారు ఆసక్తిగా తిలకించారు. మ.2లోపు గణనాథుడు నిమజ్జనమయ్యాడు.