News March 24, 2025

అల్లూరిలో ఆటో బోల్తా: ఒకరు మృతి

image

అల్లూరి జిల్లా పాడేరు మండలం రణంకోట సమీపంలో ఆదివారం రాత్రి ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఈదులపాలెం నుంచి అయినాడ వెళ్తున్న ఆటో రణంకోట ఘాటి వద్ద బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలు అంతరాయం ఏర్పడింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News November 12, 2025

సిరిసిల్ల: ‘రైతు బజార్‌లోనే విక్రయాలు జరగాలి’

image

సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్‌లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్‌ను బుధవారం పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, పాల్గొన్నారు.

News November 12, 2025

SRCL: ‘కొత్తచెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి’

image

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఇన్చార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. చెరువు కట్టపైకి వెళ్లి, పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు.

News November 12, 2025

సికింద్రాబాద్‌లోని NIEPMDలో ఉద్యోగాలు

image

సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<>NIEPMD<<>>) 13 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 17న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, బీటెక్/PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.niepid.nic.in