News February 27, 2026

అల్లూరిలో తెలుగు భాష పండితుల పదోన్నతులు

image

అల్లూరి జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్-2 తెలుగు భాషా పండితులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారం కావడం శుభపరిణామమని జిల్లా తెలుగు భాష పండితుల యూనియన్ నాయకులు శిరగం కోటేశ్వరరావు, కూడా నాగేశ్వరరావు తెలిపారు.

Similar News

News February 27, 2026

ఏపీకి మరో కంపెనీ.. వివరాలివే

image

AP: జపాన్‌కు చెందిన ప్రొటీరియల్ కంపెనీ రాష్ట్రానికి రానుంది. తిరుపతిలోని శ్రీసిటీలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఇందులో ట్రాన్స్‌ఫార్మర్లలో ఉపయోగించే అమోర్ఫస్ మెటల్‌ను ఉత్పత్తి చేయనుంది. తొలి దశలో $77 మిలియన్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ పూర్తయ్యాక ఏడాదికి 30వేల టన్నులు ఉత్పత్తి చేయనుంది. జపాన్, యూఎస్ తర్వాత అమోర్ఫస్ మెటల్ కోసం ఏర్పాటయ్యే మూడో ప్లాంట్ ఇదే కావడం విశేషం.

News February 27, 2026

వనపర్తి: అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ బాధ్యతలు

image

వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఖీమ్యా నాయక్ ఐఏఎస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, వేగానికి ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.

News February 27, 2026

NZB: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచే రిజిస్ట్రేషన్లు

image

హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైందని DYSO పవన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, మార్చి13 నుంచి 17 వరకు మండల, 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, 27 నుంచి మే 1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయని ఆయన తెలిపారు. నేటి నుంచి మార్చి 4 వరకు https:///tgss.telangana.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు.