News December 23, 2025

అల్లూరి: అనారోగ్యంతో విద్యార్థి మృతి

image

వై. రామవరం మండలం మునసలపాలెం గ్రామానికి చెందిన బి.సాయికుమార్ రెడ్డి (8) అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం ఇంటివద్దే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. వెదురునగరం పాఠశాలలో 3వ తరగతి చదువుతూ ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా జ్వరం, పచ్చకామెర్లుతో బాధ పడుతుండంతో ఇంటికి తీసుకొచ్చి వైద్యం అందజేస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 25, 2025

కొబ్బరి తోటలకు ‘తెల్లదోమ’ ముప్పు: సాజా నాయక్

image

జిల్లాలో 13,650 హెక్టార్లలో విస్తరించిన కొబ్బరి తోటలపై రాబోయే మూడు నెలల్లో తెల్లదోమ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్‌ హెచ్చరించారు. దీని నివారణకు పవర్‌ స్ప్రేయర్‌తో నీళ్లు, వేపనూనె, ఈసారియా ఫ్యూమోసోరోజియా పిచికారీ చేయాలని సూచించారు. పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడంతో పాటు, మిత్రకీటకాలను సంరక్షించుకోవడం ద్వారా తెల్లదోమను అరికట్టవచ్చని గురువారం తెలిపారు.

News December 25, 2025

చైనా మాంజా వాడితే జైలుకే: సీపీ హెచ్చరిక

image

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసేందుకు ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఇలాంటి మాంజాతో పక్షులతో పాటు ప్రాణికోటికి, వాహనదారులకు తీవ్ర ప్రాణాపాయం పొంచి ఉందన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, యువత పర్యావరణహితమైన దారాలను మాత్రమే వాడాలని, పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సీపీ సూచించారు.

News December 25, 2025

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. రాజ్‌బరి జిల్లాలో 29 ఏళ్ల యువకుడు అమృత్ మండల్‌ను కొట్టి చంపారు. బుధవారం రాత్రి 11 గం.కు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దారుణంగా దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అమృత్ దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఈ హింసకు తెగబడ్డారు. కాగా ఇటీవల <<18624742>>దీపూ చంద్రదాస్<<>> అనే హిందూ యువకుడిని కొందరు కొట్టి చంపి, తగలబెట్టిన విషయం తెలిసిందే.