News September 10, 2024

అల్లూరి: అలిగి పుట్టింటికి వచ్చి మృతి

image

గూడెం కొత్తవీధి మండలం చట్రాపల్లికి చెందిన పండన్న పెద్ద కుమార్తె కొర్ర కుమారి(20)కి రెండేళ్ల క్రితం చింతపల్లి మండలం దోమలగొందికి చెందిన రాజుతో వివాహమైంది. భర్త తరచూ తాగి ఇంటికి వస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారం రోజుల క్రితం కుమారి భర్తపై అలిగి చట్రాపల్లి పట్టింటికి వచ్చేసింది. కొండచరియలు పండన్న ఇంటిపై పడడంతో నిద్రలోనే ఆమె మృతి చెందింది. కుమారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 5, 2026

రైల్వే జోన్‌పై కేంద్రం చిన్నచూపు.. విశాఖ వాసుల ఆవేదన

image

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. 2026 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ. 170 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.3,500 కోట్ల అంచనా వ్యయం ఉన్న ఈ ప్రాజెక్టుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవని, జోన్ నిర్మాణంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నామమాత్రపు కేటాయింపులతో జోన్ కల నెరవేరడంపై విశాఖ ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

News February 5, 2026

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి: కలెక్టర్

image

జిల్లా ఆఫ్-సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ త్వరగా పూర్తిచేసేలా సంబంధిత శాఖలు, పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. క‌లెక్ట‌రేట్‌లో క్రైసిస్ గ్రూప్ జిల్లా స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పాతబడిన, పనికిరాని యంత్రాలు, నిరుపయోగ సామగ్రిని తొలగించి, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు.

News February 5, 2026

విశాఖ: చెత్త కుప్పలో బాంబు అంటూ పరుగులు..

image

విశాఖలోని తాటిచెట్లపాలెంలో అర్ధరాత్రి బాంబు కలకలం రేపింది. చెత్తకుప్పలో ఉన్న స్కూల్ బ్యాగ్‌లో లైటింగ్ బ్లింక్ కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఐఎఫ్ఆర్‌ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన పోలీసులు వేంటనే 112కి కాల్ చేసి అప్రమత్తం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లి పరిశీలించగా పిల్లలు ఆడుకునే బొమ్మ అని నిర్ధారణ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.