News March 12, 2025
అల్లూరి: ఆటో- బైక్ ప్రమాదం.. ఒకరు మృతి

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మారేల వద్ద బుధవారం సాయంత్రం బైక్-ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పెదబయలు మండలం మొండికోటకు చెందిన పల్లిపోయిన నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అతివేగంగా బైక్ నడిపి ఆటోను ఢీకొట్టడం వలన ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Similar News
News March 13, 2025
‘ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు’

∆} సత్తుపల్లి: ‘మద్యం మత్తులో ఢీ.. ఇద్దరికి గాయాలు’ ∆} ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ ∆} సత్తుపల్లి: పురుగు మందుతో రైలు పట్టాలపై ఆందోళన ∆} వైరాలో ప్రమాదం.. ఒకరు మృతి ∆} ఖమ్మం: ఐదుగురికి షోకాజ్ నోటీసులు ∆}ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం ∆}ఖమ్మం: ఎలక్ట్రికల్ షాప్‌లో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం ∆} ఖమ్మం: ‘ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి’.
News March 13, 2025
కళ తప్పిన గోవా టూరిజం.. కారణాలు ఇవే!

ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడిన గోవా ప్రస్తుతం వెలవెలబోతోంది. 2019లో 85 లక్షల మంది రాగా, 2023లో 15 లక్షల మంది మాత్రమే సందర్శించారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియాలో మరింత తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండడం, గోవాలో ఆటో, ట్యాక్సీ మాఫియా, ఇక్కడ జీవన వ్యయం పెరగడం వల్ల విదేశీ టూరిస్టులు తగ్గారని సమాచారం. దీనిని పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
News March 13, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

√ VKB:ఇంటర్ పరీక్షలకు 162 మంది విద్యార్థులు గైర్హాజరు √ కొడంగల్: రావులపల్లి వైన్ షాప్ లో అర్ధరాత్రి చోరీ √దోమ: గ్రూప్-2లో సత్తా చాటిన గిరిజన యువకుడు √కోట్ పల్లి:గ్రూప్-1లో సత్తా చాటిన మోతుకుపల్లి యువతి √VKB: ఆరుగురిపై వీధి కుక్కల దాడి √తాండూర్:రూ.1.29 లక్షల నగదు అపహరణ √ వికారాబాద్ జిల్లాకు చెందిన జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి.