News February 8, 2026
అల్లూరి: ఆశా కార్యకర్తల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల పరిధిలోని ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను శనివారం నుంచి ఫిబ్రవరి 20వ తేదీ లోగా సంబంధిత ఆస్పత్రి వైద్యునికి స్వయంగా అందజేయాలని సూచించారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
హోలీ పండుగ స్పెషల్.. విశాఖ నుంచి ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ విడుదల

హోలీ పండుగ రద్దీ దృష్ట్యా భారత రైల్వే మార్చి నెలలో విశాఖ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. చర్లపల్లికి మార్చి 6 నుంచి 27 వరకు (శుక్రవారాలు), బెంగళూరుకు మార్చి 1 నుంచి 29 వరకు (ఆదివారాలు), తిరుపతికి మార్చి 2 నుంచి 30 వరకు (సోమవారాలు) ఈ రైళ్లు నడుస్తాయి. అలాగే షాలిమార్, సంబల్పూర్, భువనేశ్వర్ మార్గాల్లోనూ మార్చి నెల అంతా వారపు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
News February 16, 2026
MBNR: మధ్య తరగతి కుటుంబం నుంచి మేయర్ దాకా!

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ అప్పన్నపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గుమాల్ మమత శీను ముదిరాజ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ తొలి మహిళ మేయర్‌గా మమత ఎన్నిక కావడం విశేషం. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి మేయర్‌గా ఎన్నిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 16, 2026
కృష్ణా: తండ్రికి ఆసరాగా వెళ్తూ.. అనంత లోకాలకు!

తండ్రికి ఆసరాగా ఉండాలనుకున్న ఆ యువకుడిని జలరూపంలో మృత్యువు కబళించింది. పోరంకికి చెందిన డిగ్రీ విద్యార్థి సత్యనారాయణ, ఆదివారం సెలవు కావడంతో తండ్రితో కలిసి కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతై మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


