News March 1, 2025

అల్లూరి: ఇంటర్ పరీక్షలు.. 666 మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 666మంది అయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. సాధారణ పరీక్ష తెలుగు 1కి 6,350 మంది విద్యార్థులకు గాను 5,892 మంది హజరైయ్యారని అని పేర్కొన్నారు. 458మంది హాజరు కాలేదని తెలిపారు. ఒకేషనల్ పరీక్ష‌కు 1,301 మంది విద్యార్థులకు గాను 1,093 మంది హజరు కాగా 208మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు.

Similar News

News November 3, 2025

NRPT: నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం

image

విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నేడు నారాయణపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్‌‌ఈ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను రాతపూర్వకంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించేందుకు రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

News November 3, 2025

జగిత్యాల: 55 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు..!

image

జగిత్యాల పట్టణంలోని మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్ ( ప్రస్తుత ఓల్డ్ హై స్కూల్ ) 1969-70 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 55 ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరంతా తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రోజంతా హాయిగా గడిపారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, రాచకొండ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.

News November 3, 2025

మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

image

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్‌కు అప్పగించారు.