News March 5, 2025

అల్లూరి: ఈనెల కూడా పప్పూ.. పంచదార లేదు..!

image

అల్లూరి జిల్లాలో కందిపప్పు, పంచదార ఈనెల కూడా చౌక డిపోలకు చేరలేదు. జిల్లా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ బియ్యం మాత్రమే ఇస్తున్నారు. దీంతో తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్‌కు నిరాశ తప్పలేదు. జిల్లాలో మొత్తం 671 చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా సరఫరా చేసేందుకు 298 టన్నుల కందిపప్పు, 168 టన్నుల షుగర్ అవసరం. కాగా ఈ నెల కందిపప్పు ఇంకా సరఫరా కాలేదని జిల్లా సివిల్ సప్లై మేనేజర్ గణేశ్ కుమార్ అన్నారు.

Similar News

News November 6, 2025

మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

image

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.

News November 6, 2025

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ జానకి రామయ్య మృతి

image

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య (93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారు రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించిన మండవ, పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News November 6, 2025

ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.