News March 1, 2025
అల్లూరి: ఒక్క నిమిషం .. వారి కోసం..!

అల్లూరి జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో 5,128 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే.వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
Similar News
News March 1, 2025
నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు: హోంమంత్రి

AP: కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అంతర్యుద్ధం లేదని, YCPలో రాకుండా చూసుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. తప్పు చేసిన వారిని వదలబోమని చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని హెచ్చరించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులున్నాయని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ క్షమించరని చెప్పారు. తాము రెడ్‌బుక్ ప్రకారం ముందుకెళ్తే YCP నేతలు రోడ్లపై తిరగలేరన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
News March 1, 2025
గొలుగొండ: మేడ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో శనివారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు. సీహెచ్.నాగపురం గ్రామానికి చెందిన మరిసా కృష్ణ ప్రమాదవశాత్తు ఇంటి మేడ పైనుంచి కింద పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News March 1, 2025
శ్రీశైలంలో నకిలీ నోట్ల కలకలం

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నకిలీ నోట్లు చలామణి కావడం కలకలం రేపింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తుల లక్షలాదిగా తరలివచ్చారు. ఈ క్రమంలో శ్రీశైలంలో వ్యాపారాలు ముమ్మరంగా సాగాయి. దీన్ని అదనుగా భావించిన కొందరు నకిలీ నోట్లతో పలు వస్తువులు కొనుగోలు చేశారు. తాజాగా రూ.200 నకిలీ నోట్లను గుర్తించినట్లు ఐస్క్రీం వ్యాపారులు తెలిపారు.