News April 25, 2025
అల్లూరి: కవల పిల్లలకు ఒకేలా మార్కులు

ముంచింగిపుట్టు మండలం మాకవరం గ్రామానికి చెందిన రామ్, లక్ష్మణ్ కవల పిల్లలు. వాళ్లిద్దరూ కలిసి పుట్టారు. కలిసి పెరిగారు. కలిసే చదివారు. ఇద్దరిదీ ఒకే రూపం, ఒకే బడి, ఒకే తరగతి, చివరికి వారికి వచ్చిన మార్కులూ కూడా ఒక్కటే. ముంచింగిపుట్టు GTWAస్కూల్ (B-1)లో 10వ తరగతి చదివి, ఇటీవల విడుదలైన ఫలితాలలో సమాన మార్కులు(349)తో పాస్ అయ్యి ఆశ్చర్య పరిచారు. ఇది కాకతాళీయమే అయినా, పేరెంట్స్, టీచర్స్ సంతోషంగా ఉందన్నారు.
Similar News
News January 6, 2026
మెదక్: గుప్త నిధుల పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్

గుప్త నిధులు తీస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై బాలరాజు తెలిపిన వివరాలిలా.. కాట్రియాలలో గుప్త నిధుల పేరుతో మోసానికి పాల్పడిన సిరిసిల్లకు చెందిన కందకంచి రాజారాం, కందకంచి రాజేష్, అశోక్‌లను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
News January 6, 2026
బీ ఫార్మసీ విద్యార్థులకు ఊరట

TG: ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల్లో చదివే ఫస్టియర్ విద్యార్థులకు ఊరట లభించింది. గతేడాది నవంబరులో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల కోసం ప్రైవేట్ కాలేజీలు బంద్ చేపట్టగా, JNTU పరీక్షలను వాయిదా వేయలేదు. దీంతో వేల మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. వారి తల్లిదండ్రుల ఆందోళనలతో ఈ నెల 27,29 తేదీల్లో ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని JNTU ప్రకటించింది.
News January 6, 2026
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం దిక్సూచి: జనగామ కలెక్టర్

దిక్సూచి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వివిధ రకాల వైద్య పరీక్షలను నిర్వహించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జనగామ జిల్లా విద్యార్థుల ఆరోగ్య సమగ్రాభివృద్ధి దిశగా జరుగుతున్న దిక్సూచి (DIKSUCHI) కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశ హాల్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు.


