News December 21, 2025
అల్లూరి: కిలో చికెన్ రూ.260

అల్లూరి జిల్లాలో పలు ప్రాంతాల్లో బ్రాయిలర్ చికెన్ స్కిన్‌తో కిలో రూ.260కాగా, స్కిన్ లెస్ రూ.280 ఉంది. ఈ ధర రాజవొమ్మంగి, కొయ్యూరు, చింతపల్లి, రంపచోడవరం మండలాల్లో ఉంది. పాడేరు, ముంచింగిపుట్టు తదితర మండలాల్లో రూ.300 వరకు విక్రయిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. గత వారం కంటే రూ.20 పెరిగిందన్నారు. రాజమండ్రి, నర్సీపట్నం, అనకాపల్లి నుంచి కోళ్లు జిల్లాకి వస్తాయని వ్యాపారులు చెప్పారు.
Similar News
News December 23, 2025
నేడు మేడారానికి మంత్రులు

సమ్మక్క, సారలమ్మ జాతర పనులను పర్యవేక్షించడానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క మేడారంలో పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకొని గద్దెల నిర్మాణం, ఆలయ పరిసర ప్రాంతాలను మంత్రులు పరిశీలించనున్నారు. దీంతో పాటుగా బుధవారం గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉండడంతో దానిపై కూడా పూజారులతో రివ్యూ చేయనున్నారు.
News December 23, 2025
చిత్తూరు: మూడేళ్ల నుంచి 257 మంది మృతి

బైక్ ప్రమాదాలలో మృత్యువాతను తప్పించేలా చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకపోవడంతో 2023లో 84 మంది, 2024లో 90, ఈ సంవత్సరం ఇప్పటివరకు 83 మంది ప్రమాదాలలో మృతి చెందారు. వీటిని అరికట్టేందుకు అధికారులు గత కొద్ది రోజులుగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నారు.
News December 23, 2025
చౌటుప్పల్: సర్పంచ్ మాట నిలబెట్టుకున్నారు

ధర్మాజీగూడెం సర్పంచ్ జువ్వి నరసింహ తన పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆదర్శంగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా.. గ్రామంలో ప్రధాన సమస్యగా మారిన కోతుల బెడదను నివారించేందుకు రూ.1 లక్ష విరాళాన్ని సోమవారం గ్రామ పెద్దలకు అందజేశారు. కోతుల సమస్య నుంచి గ్రామాన్ని విముక్తం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.


