News April 25, 2024
అల్లూరి: గ్యాస్ పొయ్యి లేని గ్రామం

కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయితీ కొత్త బొర్రంపేటలో నేటికీ గ్యాస్ సిలిండర్లు వాడరు. 35 కుటుంబాలు నివాసముంటున్నామని గ్రామస్థులు తెలిపారు. గ్యాస్ ఎలా వినియోగించాలో తెలియదని, కట్టెలు పొయ్యిలోనే ఆహారం తయారు చేసుకుంటామని వారు చెబుతున్నారు. తరచూ అడవి నుంచి కట్టెలు కొట్టుకుని తెచ్చుకుంటామని అంటున్నారు.
Similar News
News October 13, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు PGRS

విశాఖ కలెక్టరేట్‌లో ఈనెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News October 12, 2025
బాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేసిన సీపీ

విశాఖలో ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు పలు స్వచ్చంధ సంస్థల్లో ఉంటున్న బాల బాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి ప్రత్యేక పాస్‌లు ఏర్పాటు చేశారు. 11 ఆర్గనైజేషన్ల నుంచి సుమారు 300 మంది బాలికలకు పాస్‌లు ఏర్పాటు చేసి వారితో కలిసి సీపీ మ్యాచ్ విక్షించారు. ఈ అవకాశం కల్పించిన సీపీతో పిల్లలు ఫొటోలు దిగారు.
News October 12, 2025
వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో మ్యాచ్

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో ఆదివారం డీఆర్ఎం వాల్తేర్ XI వర్సెస్ నేవీ XI మ్యాచ్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఈ మ్యాచ్‌లో నేవీ XI మొదట బాటింగ్ చేసి 20 ఓవర్లకు 133 రన్స్ చేసింది. ఛేదనలో డీఆర్ఎం వాల్తేర్ XI 17 ఓవర్లలో 134 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ భారత రైల్వే, నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసిందని రెండు వర్గాల అధికారులు పేర్కొన్నారు.