News March 18, 2026
అల్లూరి: ‘గ్రామస్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి’

గ్రామస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం పాడేరు కలెక్టర్ క్యాంపు ఆఫీస్ నుండి పోలవరం, అల్లూరి జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News April 16, 2026
‘దోశ, ఇడ్లీ..’ పాట.. BCCIకి CSK ఫిర్యాదు!

బెంగళూరు వేదికగా ఏప్రిల్ 5న RCBతో జరిగిన మ్యాచ్‌లో DJ ‘దోశ, ఇడ్లీ, సాంబార్’ పాటను ప్లే చేయడాన్ని CSK మేనేజ్మెంట్ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఫిర్యాదు చేస్తూ BCCIకి లెటర్ రాసినట్లు ఫ్రాంచైజీ MD కాశీ విశ్వనాథన్ తెలిపారు. తమ ప్లేయర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, స్టేడియంలో వాతావరణం ఏమాత్రం బాగోలేదని ఆయన తెలిపారు. దీనిపై విచారణ జరుపుతామని IPL గవర్నింగ్ కౌన్సిల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
News April 16, 2026
నదిలో నాణేలు వేస్తున్నారా? ఈ విషయం మీకు తెలుసా?

నదిలో నాణేలు వేయడానికి ఆది/మంగళ వారాలు ప్రశస్తమైనవని పండితులు చెబుతున్నారు. స్నానాంతరం శుభ్రమైన దుస్తులు ధరించి, తూర్పు ముఖంగా ఉంటూ, కులదైవాన్ని ప్రార్థిస్తూ ఈ పరిహారం పాటించాలి. రాగి నాణేన్ని ప్రవహించే నీటిలోనే వేయాలి. అది నీటి ప్రవాహంతో పాటు ముందుకు సాగిపోతే జాతక దోషాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. పూర్వం నీటి శుద్ధి కోసం రాగిని వాడే ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోందంటున్నారు పండితులు.
News April 16, 2026
అందరి చూపూ పార్లమెంట్ సమావేశాలపైనే..

ఎన్నడూ లేనంతగా యావత్ దేశం పార్లమెంట్ సమావేశాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మహిళా రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడమే అందుకు కారణం. మహిళా బిల్లుకు అందరూ ఓకే అంటున్నా డీలిమిటేషన్‌ను మాత్రం ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కాసేపట్లో కేంద్రమంత్రి అర్జున్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును LSలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చ జరగనుంది. సాయంత్రం PM మోదీ ప్రసంగిస్తారు.


