News December 22, 2025
అల్లూరి: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

ఎటపాక మండలం K.N.పురం బాలుర ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న తెల్లం గౌతం అనారోగ్యం కారణంగా సోమవారం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విద్యార్థిది ఎటపాక మండలం కృష్ణవరం. విద్యార్థి కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా గౌతమ్ 6వ తరగతి నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు.
Similar News
News December 22, 2025
GHMC డీలిమిటేషన్‌పై పిటిషన్ల కొట్టివేత

TG: GHMC డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల గ్రేటర్‌లో విలీనం చేసిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.
News December 22, 2025
అమరావతిలో వరదనీటి ఎత్తిపోతకు మరో లిఫ్ట్

AP: వరద నీటిని ఎత్తిపోయడానికి ₹444Crతో మరో లిఫ్ట్ ప్రాజెక్టుకు CM CBN ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో CRDA ఆమోదం తెలిపింది. క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో ₹103.96Crతో రీసెర్చ్ సెంటర్, LPS జోన్8లో ₹1358 కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి, IAS క్వార్టర్లలో ₹109Crతో అదనపు సౌకర్యాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 202ఎకరాలు జరీబా లేదా మెట్టా తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కొండవీటి వాగుపై ఒక లిఫ్ట్ ఉంది.
News December 22, 2025
ఖమ్మం: ఏఎస్సైలుగా 10 మందికి పదోన్నతి

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్‌గా నిరంతరంగా సేవలందించి ఏఎస్సైగా ఉద్యోగోన్నతి పొందిన 10 మంది హెడ్ కానిస్టేబుళ్లను కమిషనర్ కార్యాలయంలో సోమవారం పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు. ఏఎస్సైగా పదోన్నతి పొందిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.


