News March 2, 2025
అల్లూరి: చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి

ముంగర్లపాలెంలో చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు గొలుగొండ ఎస్ఐ పీ.రామారావు ఆదివారం తెలిపారు. జీ మాడుగుల మండలం గడుతూరుకు చెందిన గెమ్మెలి శేఖర్ తన చిన్నాన్న గ్రామమైన మండలంలోని సీతకండికి కూలీ పనుల నిమిత్తం వచ్చాడు. ఈ క్రమంలో ముంగర్లపాలెంలో చింతచెట్టు ఎక్కగా చెట్టుపై నుంచి పడిపోవడంతో మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని చెప్పారు.
Similar News
News November 9, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్పీఎస్ అభ్యర్థులు: నాగరాజు

రాష్ట్రంలో జరిగే ప్రతి ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అభ్యర్థులు పోటీ చేస్తారని ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు తెలిపారు. శనివారం ఆయన అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ఎమ్మెల్సీలను నమ్మి ఓటు వేసిన గ్రాడ్యుయేట్, ఉద్యోగ, ఉపాధ్యాయ ఓటర్లను మోసం చేస్తున్నందునే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆర్పీఎస్ పోటీ చేస్తుందన్నారు.
News November 9, 2025
సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి సర్క్యులర్ జారీ

సింగరేణి సంస్థలో అంతర్గత అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది. ఈ 2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23, సివిల్‌లో 4, ఈ 1 గ్రేడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్‌లో 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10 నుంచి 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు
News November 9, 2025
ధర్మపురి నర్సన్నకు భారీ ఆదాయం

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల తాకిడీ పెరిగింది. దీంతో అదే మొత్తంలో నర్సన్నకు భారీగా ఆదాయం సమకూరింది. దేవాలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టికెట్ల ద్వారా రూ.2,72,258, ప్రసాదాల ద్వారా రూ.1,95,750, అన్నదానం ద్వారా రూ.57,759.. మొత్తం ఆదాయం రూ.5,25,767 ఆదాయం వచ్చింది. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.


