News August 9, 2025

అల్లూరి: చెల్లిపోని బంధం మీదమ్మా!

image

తోబుట్టువుల ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పే మాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లడిల్లిపోతారు. కళ్లు చెమ్మగిల్లుతాయి. ప్రేమలు, ఆప్యాయతల కలబోత వీరి బంధం. మరి ఈ రక్షా బంధన్‌కు మీకు రాఖీ కట్టిన సోదరికి కామెంట్ చేసి విషెస్ చెప్పండి.

Similar News

News August 9, 2025

GWL: వాడవాడల రక్షాబంధన్ వేడుకలు

image

నడిగడ్డలోని గ్రామాలు, పట్టణాలు, వాడవాడలో శనివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే వేడుకలకు సుదూర ప్రాంతాల్లో ఉన్న అక్క చెల్లెళ్లు అన్నదమ్ములను కలిసి రాఖీలు కట్టారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆయన సోదరి, NHPS జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి అన్నపై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

News August 9, 2025

ఢిల్లీలో నేతలను కలిసినప్పుడు అరకు కాఫీ ఇస్తున్నా: CM

image

గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లను పెంచే విధంగా చర్యలు తీసుకుంటానమి CM చంద్రబాబు తెలిపారు. వారికి ఇన్సెంటివ్‌లు పెంచి ఇక్కడకు వచ్చేలా చూస్తామని చెప్పారు. అరకు కాఫీ లాంటి స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తన లక్ష్యమన్నారు. ఢిల్లీలో తాను ఎవరినైనా కలిస్తే శాలువా కప్పి అరకు కాఫీని ఇస్తున్నాని చెప్పారు. ఏజెన్సీలో వ్యయసాయాన్ని పోత్రహిస్తున్నామని, గిరిజనుల ఆదాయాన్ని పెంచుతామన్నారు.

News August 9, 2025

పాడేరు: సీఎంకి రాఖీ కట్టిన మంత్రి సంధ్యారాణి

image

సీఎం చంద్రబాబు నాయుడు శనివారం పాడేరు మండలం వంజంగిలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన వివిధ ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. రాఖీ పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రాఖీ కట్టారు. అనంతరం ఆమెను సీఎం ఆశీర్వాదించారు.