News March 12, 2025

అల్లూరి జిల్లాకు ప్రత్యేక అధికారి.!

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ IAS అధికారి ఎం.ఎం. నాయక్‌‌ను అల్లూరి జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాల్ని సరిగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News March 6, 2026

రష్యా క్రూడాయిల్ వచ్చేస్తోంది!

image

అమెరికా <<19308509>>ఆంక్షల సడలింపు<<>>తో రష్యా నుంచి భారీగా ముడి చమురు ఇండియాకు రానుంది. 1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్‌తో కూడిన 12కి పైగా ట్యాంకర్లు భారత తీరానికి దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అవి వారంలో మన పోర్టులకు చేరుకోవచ్చని బ్లూమ్‌బర్గ్ డేటా చెప్పింది. సింగపూర్ వద్ద ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలోనే వస్తాయని వివరించింది. US నుంచి సిగ్నల్ రాకముందే రష్యా ట్యాంకర్లు ఇండియా వైపు మళ్లాయని తెలుస్తోంది.

News March 6, 2026

తిరుపతి: రేపే మహిళా యూనివర్సిటీ కాన్వకేషన్

image

తిరుపతి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారం 22వ కాన్వకేషన్ నిర్వహిస్తున్నట్లు వీసీ ఉమ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మొత్తం 1,601 మందికి డిగ్రీ పట్టాలు అందజేస్తామని తెలిపారు.

News March 6, 2026

మహిళల ఆరోగ్యానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఎంతో మేలు: ఎంపీ సురేష్

image

స్వయం సహాయక సంఘాల మహిళలకు ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ అన్నారు. మెదక్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, రైతులకు సకాలంలో బీమా అందేలా చూడాలని అధికారులను కోరారు. అలాగే సింగూరు మరమ్మతుల దృష్ట్యా వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.