News February 19, 2026

అల్లూరి జిల్లాను మోడల్ జిల్లాగా మార్చడమే లక్ష్యం: కలెక్టర్

image

అల్లూరి జిల్లాను రాష్ట్రంలోనే ఒక మేటి మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం విశాఖలో జరిగిన నీతి అయోగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయం, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. సహజసిద్ధ అందాలను ప్రపంచానికి పరిచయం చేసి, అరకు, లంబసింగి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు

Similar News

News February 20, 2026

పాత ఫోన్లలో అరుదైన ఖనిజాలు!

image

పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ విమానాలు, క్షిపణులు, EVల్లో వాడే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇవి నియోడైమియం, సమారియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌తో తయారైన శక్తిమంతమైన మ్యాగ్నెట్స్ అని పేర్కొంటున్నారు. వీటిని రిసైకిల్ చేస్తే ఇండియాకు తిరుగుండదని, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పని ఉండదని వెల్లడిస్తున్నారు.

News February 20, 2026

16 శుక్రవారాల వ్రతం ఉద్యాపన విధానం

image

16 శుక్రవారాల వ్రతం పూర్తయ్యే చివరి వారంలో ‘ఉద్యాపన’ చేయాలి. ఆ రోజున 8 మంది బాలురను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. భోజనంలో పాయసం, పూరీ, బెల్లం, శనగలు వడ్డించాలి. భోజనంలో పులుపు ఉండకూడదు. భోజనం తర్వాత పిల్లలకు అరటిపండు, ప్రసాదం, దక్షిణ ఇవ్వాలి. పిల్లలు ఆ రోజున ఏ విధమైన పులుపు పదార్థాలు తినకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే వ్రతం సంపూర్ణమవుతుంది. అమ్మవారి కృపతో ఆ ఇల్లు సుఖశాంతులతో నిండిపోతుంది.

News February 20, 2026

బంగారు మనసు.. 100గ్రా. గోల్డ్ తిరిగిచ్చేశాడు!

image

₹15 లక్షల విలువైన బంగారాన్ని తిరిగిచ్చి స్క్రాప్ డీలర్ నిజాయతీ చాటుకున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో అశోక్ శర్మ 2025లో కుంభమేళాకు వెళ్తూ 100G బంగారం పేపర్లో దాచి మరిచిపోయారు. దీపావళికి ఇల్లు క్లీన్ చేసి, పొరపాటున స్క్రాప్‌తో కలిపి అమ్మేశారు. తర్వాత స్క్రాప్‌ షాపులో వెతికినా బంగారం దొరకలేదు. ఈ క్రమంలో 4 నెలల తర్వాత షాప్ యజమాని అఖ్తర్ ఖాన్‌కు బంగారం కనిపించింది. పోలీసుల ద్వారా అశోక్‌కు అందజేశారు.