News March 19, 2024
అల్లూరి జిల్లాలోని చట్టి చెక్ పోస్టు మూసివేత

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను G.O.MS-24 ప్రకారం మూసివేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు మండలంలోని రవాణా శాఖ చట్టి చెకపోస్ట్‌ను కూడా మూసివేయటం జరిగిందని జిల్లా రవాణాధికారి లీలా ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఇతర రాష్ట్ర వాహనదారులు పన్నులు, పర్మిట్‌లు ఇతర సేవలను ఆన్‌లైన్‌లో తీసుకోవాలని సూచించారు.
Similar News
News January 26, 2026
విశాఖ: కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, స్థానిక ఎమ్మెల్యేలు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కూటికుప్పల సూర్యారావు, సీపీ శంఖబ్రత బాగ్చి ఉన్నారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
News January 26, 2026
మాధవధార: జలధార వద్ద భక్తులు ఫుల్.. సౌకర్యాలు నిల్!

మాధవధారలో జలధార వద్ద సింహాచలం దేవస్థానం ఉప దేవాలయలు, మాధవస్వామి ఆలయం ఉన్నాయి. మాఘ మాసంలో అధిక సంఖ్యలో జలధార స్నానం చేసేందుకు భక్తులు వస్తుంటారు. గతంలో లక్షల రూపాయల ఖర్చుపెట్టి స్నానాలు చేసేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పైప్ లైన్ పనిచేయడం లేదు. మహిళల దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్స్ కూడా లేవు. దీనిపై అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.
News January 26, 2026
సముద్ర గర్భంలో జాతీయ జెండా రెపరెపలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఋషికొండ ఐటీ జంక్షన్ సమీప సముద్రంలో ‘డైవ్ అడ్డా’ ఆధ్వర్యంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. సీఈఓ భద్రం రామిశెట్టి పర్యవేక్షణలో డైవ్ మాస్టర్స్ బాబి, విష్ణవ్, అర్జున్, స్కోబా డైవర్ సంతోష్ కనకాల సుమారు 15 అడుగుల లోతుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సముద్ర గర్భంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడటం పట్ల పర్యాటకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


