News February 10, 2025

అల్లూరి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

image

అల్లూరి జిల్లా మన్యంలో 11వ తేదీన జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మన్యంలో బంద్ జరుగుతున్నందున ఈ తేదీలు మార్చుతున్నట్లు చెప్పారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. బంద్ వలన ఈ మార్పు గుర్తించి తదుపరి తేదీ తెలుసుకొని పరీక్షకు రావలసిందిగా కలెక్టర్ ప్రకటించారు.

Similar News

News February 11, 2025

యాదాద్రిలో శ్రీవారి ఆదాయం రూ.22,60,628

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ప్రధాన బుకింగ్, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,60,628 ఆదాయం వచ్చిందని ప్రకటించారు.

News February 11, 2025

విశాఖ: ఆన్‌లైన్ లోన్‌యాప్స్ ముఠా అరెస్ట్  

image

ఆన్ లైన్ లోన్ యాప్స్‌తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఓ సూసైడ్ కేసు విచారణలో భాగంగా లోన్ యాప్‌లో అప్పు తీసుకుని సమయానికి కట్టకపోవడంతో ఫొటోలు మార్ఫింగ్ చేసి వారు వేధించడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. ఈ విషయంపై విశాఖ పోలీసులు నిందితుడుని కర్నూలులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

News February 11, 2025

మేడ్చల్ జిల్లా వాసులకు రేషన్‌ కార్డులు (UPDATE)

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 33,435 మంది రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వానికి ఈ వివరాలను పంపామని స్పష్టం చేసింది. త్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం రాగానే అందరికీ కార్డులు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

error: Content is protected !!