News October 26, 2025

అల్లూరి జిల్లాలో కంట్రోల్ రూం నంబర్లు ఇవే..

image

అల్లూరి జిల్లా మంతా తుఫాన్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమతంగా ఉండాలని చింతూరు ITDA PO శుభం నొక్వొల్ సూచించారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో శనివారం ప్రకటన విడుదల చేశారు. అత్యవసర సమయాల్లో చింతూరు డివిజన్ ప్రజలు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలన్నారు. కూనవరం కంట్రోల్ రూమ్ : 9652814712, వీఆర్ పురం 8008100892, చింతూరు 9492527695, ఎటపాక 8332085268 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Similar News

News October 28, 2025

వనపర్తి: మద్యం దుకాణాల లక్కీడిప్.. దంపతులకు బంపర్ లక్కు

image

వనపర్తి జిల్లాలో మొత్తం 36 మద్యం దుకాణాల కోసం 757 దరఖాస్తులు రాగా, పాన్‌గల్ మండలం వెంగలాయిపల్లి చెందిన దంపతులు గండం ప్రవీణ కుమారి, మొగిలి సురేష్ కుమార్‌లకు అదృష్టం వరించింది. ప్రవీణ కుమారికి గౌడ్ రిజర్వేషన్‌లో పాన్‌గల్-2 దుకాణం దక్కగా, సురేష్ కుమార్ గౌడ్‌కు ఓపెన్ కేటగిరీలో కొత్తకోట-3 దుకాణం లభించింది. ఒకే కుటుంబానికి 2 దుకాణాలు దక్కడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

News October 28, 2025

హరీశ్‌రావు తండ్రి మరణం బాధాకరం: ‘X’లో సీఎం

image

మాజీ మంత్రి, సిద్ధిపేట MLA హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి Xలో వేదికగా పోస్ట్ చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్‌రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని రాసుకొచ్చారు.

News October 28, 2025

శ్రీరాంపూర్: ‘సింగరేణి మాజీ ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి’

image

సీపీఆర్ఎంఎస్ స్కీమ్‌లో సభ్యత్వం ఉన్న సింగరేణి మాజీ ఉద్యోగులు నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని సంస్థ జీఎం (పర్సనల్) జీవీకే కుమార్ తెలిపారు. డిజిటల్ మాధ్యమంలో జీవన్ ప్రమాణ్ ఆండ్రాయిడ్ ద్వారా మొబైల్ ఫోన్లలో లేదా మీ సేవ కేంద్రంలో సమర్పించి నిరాటంకంగా వైద్య సేవలు పొందాలని సూచించారు. పూర్తి వివరాలకు తమ ఏరియాలోని ఏటీబీ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.