News April 24, 2025

అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం: కలెక్టర్

image

గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందని  కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు. కలెక్టరేట్‌లో గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

Similar News

News April 24, 2025

6 మ్యాచుల్లో గెలుస్తామనుకుంటున్నాం: ఫ్లెమింగ్

image

ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలపై CSK కోచ్ ఫ్లెమింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఆరు మ్యాచుల్లోనూ తాము గెలుస్తామని ఆశిస్తున్నామని చెప్పారు. కొందరు నవ్వుకున్నా గత ఏడాది ఆర్సీబీ ఇదే చేసిందన్నారు. రాబోయే మ్యాచుల్లో ఆటగాళ్లు అద్భుతంగా ఆడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ వర్కౌట్ కాకపోతే పేలవ సీజన్ నుంచి నేర్చుకుంటామన్నారు.

News April 24, 2025

టీ20ల్లో సరికొత్త రికార్డు

image

టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన సమయంలో అత్యధిక సార్లు 50+ రన్స్ చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ(62) సరికొత్త రికార్డు నెలకొల్పారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ చేయడంతో బాబర్(61)ను అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో గేల్(57), వార్నర్(55), బట్లర్(52), డుప్లెసిస్(52) ఉన్నారు.

News April 24, 2025

చంద్రమౌళి పార్థివదేహానికి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్

image

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. విశాఖలోని కనకదుర్గ హాస్పిటల్‌కి వెళ్లి చంద్రమౌళి పార్థివ దేహాంపై పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడుల్లో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తోందని పేర్కొన్నారు.

error: Content is protected !!