News March 23, 2025
అల్లూరి జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..

అల్లూరి రాజవొమ్మంగి పరిసర గ్రామాల్లో ఆదివారం స్కిన్‌లెస్ బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 260కి, స్కిన్‌తో రూ. 240కి విక్రయించారు. గత వారం కంటే కిలో కి రూ. 20 పెరిగిందని వ్యాపారులు తెలిపారు. పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, చింతూరు ఏరియాల్లో దాదాపు ఇదే రేటు పలికింది. వచ్చే రోజుల్లో ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఆదివారం 10 టన్నుల వరకు చికెన్ అమ్ముడు అవుతుందని తెలిపారు.
Similar News
News September 13, 2025
‘అనంత జిల్లాకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండండి’

అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.
News September 13, 2025
ములుగు: కనుమరుగవుతున్న బతుకమ్మ పాటలు!

బతుకమ్మ పండుగకు ఓరుగల్లు పెట్టింది పేరు. ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకునే సంబురం. 9 రోజులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఒక్కచోట చేరి జరుపుకునే పండుగ. కానీ, కొన్నేళ్లుగా బతుకమ్మ పాటలు, సంస్కృతి కనుమరుగవుతోంది. డీజేలు, వల్గర్ పాటలతో పండుగ అర్దాన్ని మారుస్తున్నారు. వింత పోకడలు, అర్థం పర్థం లేని పాటలు, విచిత్ర డాన్సులతో పూల పండుగ భవిష్యత్తు తరాలకు తెలియకుండా పోతుంది. కాగా, ఈనెల 22న ఎంగిలి పూల బతుకమ్మ.
News September 13, 2025
ఏలేశ్వరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఏలేశ్వరం డిగ్రీ కళాశాల సమీపంలో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు కళాశాల వద్దకు లేదా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలియజేయాలని పోలీసులు కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, వివరాలను సేకరిస్తున్నారు.


