News December 22, 2025
‘అల్లూరి జిల్లాలో జాఫ్రా మొక్కలకు పెరిగిన డిమాండ్’

అల్లూరి జిల్లాలో జాఫ్రా మొక్కలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతుందని రంపచోడవరం మండలం పందిరిమామిడి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త వెంగయ్య సోమవారం తెలిపారు. తాము గత ఏడాది 5,500 మొక్కలు అందజేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 11,000 మొక్కలు రైతులకు ఇచ్చామన్నారు. ప్రస్తుతం రీసెర్చ్ ప్రాంగణంలో 6,000 మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న రైతులు తమ కార్యాలయంలో సంప్రదించలన్నారు.
Similar News
News December 24, 2025
చింతపల్లిపేటలో విషాదం.. తల్లి అంత్యక్రియలకు వచ్చి కూతురు మృతి

గుర్ల మండలం చింతపల్లిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు తల్లి, కూతురు మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పలనరసమ్మ (60) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. తల్లిని చివరిచూపు చూసుకునేందుకు వచ్చిన కూతురు గౌరీ(38) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.
News December 24, 2025
వరంగల్ ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు

వరంగల్ డివిజన్ వ్యాప్తంగా 8 మంది ఎస్సైలకు సీఐగా పదోన్నతి కల్పించేందుకు డీపీసీ సిఫారసులను కమిషనర్ సి.హరికిరణ్ ఆమోదించారు. రోస్టర్ ప్రకారం రమాదేవి, రజిత, చంద్రశేఖర్, జ్యోతి, సరిత, అశోక్‌కుమార్ తదితరులకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అలాగే శ్రీనివాస్‌రెడ్డి, మురళి ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా, అంజన్రావు జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. జీవో విడుదల అనంతరం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
News December 24, 2025
PPP విధానం.. ఒక్క టెండర్ మాత్రమే వచ్చింది!

AP: <<17611905>>PPP విధానం<<>>లో వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. తొలి విడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కళాశాలలను PPP మోడల్‌లో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్లు పిలిచింది. టెండర్ల గడువును 2సార్లు పొడిగించినప్పటికీ ఆదోని కళాశాలకు మాత్రమే ఒక్క బిడ్ దాఖలైంది. దీనికి గల కారణాలపై చర్చిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.


