News March 18, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>ఉప్ప తోటల్లో సినిమా షూటింగ్ సందడి>అల్లూరి జిల్లాలో పటిష్ఠ బందోబస్తు నడుమ ప్రారంభమైన పది పరీక్షలు>పది పరీక్షలకు 117 మంది విద్యార్థులు గైర్హాజరు>వీఆర్ పురం: తేనె మంచుతో జీడిమామిడి పూతకు నష్టం>కొయ్యూరులో భానుడి భగభగలు>ఉద్యోగస్థులు విధులకు డుమ్మా కొడితే నేరం..న్యాయమూర్తి>రంపచోడవరం: గ్రీవెన్స్‌కు 82 ఫిర్యాదులు>పెదబయలు: రోగి సహాయకులకు భోజనం పెట్టాలి

Similar News

News December 29, 2025

మరిన్ని మండలాలతో కొత్తగా తిరుపతి జిల్లా.!

image

కొత్త తిరుపతి జిల్లాలో ఇక నుంచి <<18703773>>36<<>> మండలాలు ఉండనున్నాయి. ఇది వరకు 34 ఉండగా కొత్తగా అన్నమయ్య నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని( 5 మండలాలు) తిరుపతి జిల్లాలో కలిపారు. మరోవైపు గూడూరు నుంచి మూడు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపారు. దీంతో 36 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.

News December 29, 2025

NRPT: కేజీబీవీలో ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోండి

image

నారాయణపేట KGBV పాఠశాలలో వంట మనిషి, స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ బాలాజీ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 30 నుంచి జనవరి 2 లోపు దరఖాస్తులను కేజీబీవీ పాఠశాలలో అందించాలని చెప్పారు. 7వ తరగతి ఉత్తీర్ణులై స్థానిక మహిళలు అర్హులని అన్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ కోరారు. వివరాలకు కేజీబీవి పాఠశాలలో సంప్రదించాలని చెప్పారు.

News December 29, 2025

రంపచోడవరం: కొత్త జిల్లాకు పరిపాలనకు అవసరమైన భవనాలు కష్టమే.?

image

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా పేరిట నూతన జిల్లాకు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే రంపచోడవరం కేంద్రంలో పరిపాలన కోసం అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు కష్టతరంగా ఉండనుంది. ప్రస్తుతానికి వైటీసీ, పీఎంఆర్సీ భవనాలలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని శాఖల కార్యాలయాలకు భవనాలు ఏర్పాటు స్థానిక అధికారులకు తలనొప్పిగా మారనుంది.