News March 18, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>చింతపల్లి: తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ>పాపికొండల విహార యాత్రలో నైట్ హాల్ట్ లేదు>దేవీపట్నం: పొలంలో ధాన్యం చోరీ>పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయండి>రాజవొమ్మంగి: చింతపండుకు మద్దతు ధర పెంచాలి>ముంచంగిపుట్టులో తాగునీటి కోసం గిరిజనుల కష్టాలు>అరకు: అసెంబ్లీలో జీసీసీ స్టాల్ ప్రారంభం>పాడేరు: అంగన్వాడీ టీచర్, ఆయాలను నియమించండి>రాజవొమ్మంగిలో యువతి ఆత్మహత్య
Similar News
News March 19, 2025
జిల్లాలో 9 మంది తహశీల్దార్లు బదిలీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్లకు మహేశ్ కుమార్, ఎల్లారెడ్డిపేటకు సుజాత, వేములవాడ రూరల్ కు అబూబకార్, వేములవాడకు విజయ ప్రకాష్ రావు, ఈఓ విటీఎడీఎగా భూపతి, డీఏవోగా ఉమరణి, సూపరింటెండెంట్ కలెక్టరేట్‌గా రామచంద్రం బదిలీ అయ్యారు.
News March 19, 2025
రక్తదానం చేసిన హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య

తలసేమియా వ్యాధిగ్రస్తులకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ రక్తనిధిలో రక్తదాన కార్యక్రమాన్ని హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ శిబిరం యువతలో స్ఫూర్తి కలిగించేందుకు హన్మకొండ కలెక్టర్ స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం రక్త దానం చేసిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, పండ్లను అందజేశారు.
News March 19, 2025
చిరంజీవికి ముద్దు పెట్టిన మహిళా అభిమాని

మెగాస్టార్ చిరంజీవికి ఓ మహిళ ముద్దుపెట్టిన ఫొటో వైరలవుతోంది. రేపు UK పార్లమెంట్‌లో లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడానికి ఆయన లండన్ చేరుకున్నారు. అక్కడి ఎయిర్‌పోర్టులో మెగాస్టార్‌కు ఘనస్వాగతం లభించగా, ఓ మహిళా అభిమాని ఆయన బుగ్గపై ముద్దు పెట్టారు. కాగా, ‘చిన్నప్పుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాలని అల్లరి చేసిన నేనే, మా అమ్మను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లా’ అని ఆ అభిమాని కొడుకు ట్వీట్ చేశారు.