News March 29, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

 >అరకు: ఉగాదికి జోరుగా కొనుగోళ్లు>ఏప్రిల్ 1నుండి ఇంటర్ తరగతులు>పాడేరు: బాలల న్యాయమండలి సభ్యల నియామకానికి దరఖాస్తులు>పెదబయలు: ఈ-కేవైసీ కోసం తల్లిదండ్రుల పాట్లు>రాజవొమ్మంగి: సీజ్ చేసిన వాహనాల నుంచి జరిమానా వసూలు>మారేడుమిల్లిలో మినీ గోకులం షెడ్స్ ప్రారంభం>పాడేరు: ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్>ఎన్టీఆర్ మహనీయుడు..ఎమ్మెల్యే శిరీష >రంపలో సందడిగా మార్కెట్లు

Similar News

News September 18, 2025

తప్పిన మరో పెను విమాన ప్రమాదం

image

విశాఖ నుంచి HYD ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. విశాఖలో టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ ఇంజిన్‌ ఫ్యాన్ రెక్కల్లో పక్షి చిక్కుకుంది. దీంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన పైలట్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఆ టైంలో విమానంలో 103మంది ప్రయాణికులున్నారు. కొన్నినెలల కింద అహ్మదాబాద్‌ ఫ్లైట్ క్రాష్‌లో 270మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

News September 18, 2025

కొత్తగూడెం: SBI ఛైర్మన్‌ను కలిసిన సింగరేణి సీఎండీ

image

సింగరేణి గ్లోబల్ విస్తరణ ప్రాజెక్టులకు SBI సహకారం కోసం ముంబయిలో SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టితో సీఎండీ బలరామ్ భేటీ అయ్యారు. సింగరేణి విస్తరణ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వాలని కోరారు. కాగా సింగరేణి అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటామని ఎస్బీఐ ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. దశాబ్దాలుగా సింగరేణికి లీడ్ బ్యాంక్‌గా ఎస్బీఐ వ్యవహరిస్తోంది.

News September 18, 2025

వాహన మిత్ర’’ కు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

ఆటో, మాక్సీ క్యాబ్‌ వాహన యజమానులు ‘‘వాహన మిత్ర’’ పథకం కోసం సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ కార్డ్‌, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, ఫిట్‌ నెస్‌ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు.