News April 6, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటన ఖరారు>అరకు: పవన్ కల్యాణ్ పర్యటను విజయవంతం చేయండి>అల్లూరి జిల్లాలో కోతులను బెదిరించే మైక్‌లు>అల్లూరి జిల్లాలో ఎటపాక ఫస్ట్..మారేడుమిల్లి లాస్ట్>అల్లూరి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ>రంప: చెరువులో జారిపడి వ్యక్తి మృతి>అరకు ఘాట్‌లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు.
Similar News
News April 6, 2025
విశాఖ నుంచి రోడ్డు మార్గంలో అల్లూరి జిల్లాకు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పర్యటన నిమిత్తం సోమవారం విశాఖ రానున్నారు. సోమవారం తెల్లవారి 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన అల్లూరి జిల్లా వెళ్తారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేసి అరకులో బస చేస్తారు. మంగళవారం అరకు నుంచి విశాఖ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం విశాఖలో బస చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
News April 6, 2025
నల్గొండ: పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు

నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ నివాసంలో పూజలు చేసి అక్కడ నుంచి మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల నడుమ నూతన పట్టు వస్త్రాలను సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తీసుకువెళ్లి స్వామి వారికి సమర్పించారు.
News April 6, 2025
నల్లగొండ: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్టు

అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను మీడియాకు వివరించారు. ఐదుగురు నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు రూ.25 లక్షల విలువైన 600 లీటర్ల స్పిరిట్‌తో పాటు అక్రమంగా తయారు చేసిన 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు.