News March 3, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>పాడేరు: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 26 కేంద్రాలు>అల్లూరి: ఇంటర్ పరీక్షలు..224మంది గైర్హాజర్>అల్లూరి: ఓపెన్ ఇంటర్..261మంది గైర్హాజర్>అల్లూరి ఘాట్‌లో జీపు దగ్ధం>కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి>ఘనంగా ప్రారంభమైన మోతుగూడెం కొండ జాతర>దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టుకు భారీ క్రేన్లు >అనంతగిరి: అటవీశాఖ అధికారులు సహకరించాలి

Similar News

News March 4, 2025

VKB: 153 వాహనాలు సీజ్.. రూ.46,62,375 టాక్స్ వసూలు

image

జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖలో ఫిబ్రవరి 2025 సంవత్సరం ఒక్క నెలకి గాను ట్యాక్స్ చెల్లించని 153 వాహనాలను సీజ్ చేసి రూ.46,62,375 రూపాయల జరిమానాను ఒక్క నెలలోనే వసూలు చేసినట్లు వికారాబాద్ జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇంకా ట్యాక్స్ చెల్లించని వాహనదారులు ఆన్‌లైన్‌లో లేదా మీసేవా ద్వారా ట్యాక్స్ చెల్లించాలని ఆయన తెలిపారు. ట్యాక్స్ చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామన్నారు.

News March 4, 2025

అత్యంత పేదరిక జిల్లాగా కర్నూలు

image

AP: సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు (42 శాతం) అత్యంత పేద జిల్లాగా నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

News March 4, 2025

సంగారెడ్డి: రోబోటిక్ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

image

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న మినీ శిల్పారామం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన రోబోటిక్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో జిల్లా నుంచి ఏడు పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు డీఈఓ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. మొత్తం 11 పాఠశాలలు పాల్గొనగా ఏడు పాఠశాల విద్యార్థులు డైమండ్ స్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

error: Content is protected !!