News February 15, 2026

అల్లూరి జిల్లాలో తగ్గిన చికెన్ అమ్మకాలు

image

అల్లూరి, పోలవరం జిల్లాలో శివరాత్రి పండగ సందర్భంగా ఆదివారం చికెన్‌కు డిమాండ్ తగ్గింది. అడ్డతీగల, రాజవొమ్మంగి, కొయ్యూరు, చింతపల్లి, తదితర ప్రాంతాల్లో చికెన్ దుకాణాల వద్ద రద్దీ లేదు. గతవారం కిలో చికెన్ రూ.280 కాగా, నేడు రూ.240 నుంచి రూ.260కి విక్రయిస్తున్నామని వ్యాపారులు తెలిపారు. చేపలు కిలో రూ.200, మటన్ కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు.

Similar News

News February 15, 2026

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ రిపోర్ట్‌ను నమ్మొద్దు: కేంద్రం

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటలీ పత్రిక రాసిన <<19116627>>కథనాన్ని<<>> భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. పైలట్ కావాలనే ఇంజిన్లు ఆపేశాడన్న వార్తలు అసత్యమని, విచారణ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. విదేశీ ఏజెన్సీల ఊహాగానాలను నమ్మొద్దని, దేశీయ దర్యాప్తు సంస్థలపై విశ్వాసం ఉంచాలని పౌరవిమానయాన శాఖ సూచించింది. 260 మంది మరణించిన ఈ ఘటనపై తుది నివేదిక వచ్చిన తర్వాతే వాస్తవాలు వెల్లడిస్తామని పేర్కొంది.

News February 15, 2026

‘బాషా’ నిర్మాత కన్నుమూత

image

ప్రముఖ తమిళ నిర్మాత, డైరెక్టర్ తమిళ్ అళగన్ కన్నుమూశారు. ఈయన మరణంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అళగన్ ప్రొడ్యూసర్‌గా బ్లాక్‌బస్టర్ ‘బాషా’, చిరంజీవి-రజినీ కాంబోలో ‘రానువ వీరన్’(తెలుగులో బందిపోటు సింహం) తదితర చిత్రాలను నిర్మించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కాగా తమిళనాట లెజెండరీ ప్రొడ్యూసర్, రచయిత, మాజీ మంత్రి ఆర్ఎమ్ వీరప్పన్ కొడుకే ఈ అళగన్.

News February 15, 2026

ఖమ్మం: ‘ప్రపంచస్థాయి ప్రమాణాలతో బోధన’

image

ఖమ్మం హార్వెస్ట్ ప్రైమరీ పాఠశాల 24వ వార్షికోత్సవం శనివారం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని జిల్లాక్రీడల అధికారి సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కరికులమ్ ద్వారా విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీలకు సిద్ధం చేస్తున్నామని కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపల్ పార్వతీరెడ్డి తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.