News July 8, 2025
అల్లూరి జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

అల్లూరి జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. గడచిన 24గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి. వరరామచంద్రపురంలో అధికంగా 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. ముంచంగిపుట్టు 16.4, హుకుంపేట 12.4, గూడెం కొత్తవీధి 10.2, జీ.మాడుగుల 8.6, చింతపల్లి 6.8, పెదబయలు 6.2, చింతూరు 6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందన్నారు. జిల్లాలో 255.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Similar News
News July 8, 2025
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన అచ్చెన్నాయుడు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో ఆయన కార్యాలయానికి వెళ్లి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఆయనను అచ్చెన్న కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
News July 8, 2025
కారంచేడులో పంచాయతీ పురోగతి సూచిక 2.0 శిక్షణ కార్యక్రమం

కారంచేడు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ పురోగతి సూచిక 2.0 ఎఫ్ వై శిక్షణా కార్యక్రమం డీఎల్‌డీఓ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి పంచాయతీల్లో అభివృద్ధి, పారిశుద్ధ్యం తాగునీరు తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో నేతాజీ, డిప్యూటీ ఎంపీడీవో కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.
News July 8, 2025
సర్వే ప్రక్రియ రెవెన్యూ వ్యవస్థకు వెన్నుముక: కలెక్టర్ రాహుల్ శర్మ

సర్వే ప్రక్రియ రెవెన్యూ వ్యవస్థకు వెన్నుముకని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మంగళవారం గనుల వృత్తి శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లు శిక్షణను ఆయన పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడి, శిక్షణా కార్యక్రమం తీరును అడిగి తెలుసుకున్నారు. సర్వే విషయంలో సంపూర్ణ అవగాహన అవసరమని, భూ సమస్యల పరిష్కారానికి సర్వే చాలా కీలకమని కలెక్టర్ వివరించారు.