News November 30, 2025

అల్లూరి జిల్లాలో దిగివచ్చిన టమాట.!

image

అల్లూరి జిల్లాలో టమాటా రేటు గణనీయంగా తగ్గింది. రాజవొమ్మంగి, పాడేరు, కొయ్యూరు, అడ్డతీగల మండలాల్లో ఆదివారం మార్కెట్‌లో హోల్ సెల్‌గా 10కిలోలు రూ.400పలికిందని, విడిగా కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నామని వ్యాపారులు తెలిపారు. గత వారం కిలో రూ.80 పలికిందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో పండిన టమాటా కాపు పెరగడంతో రేటు తగ్గిందని అంటున్నారు.

Similar News

News April 8, 2026

నిజామాబాద్: తైబజార్ వేలంలో కాసుల వర్షం

image

నిజామాబాద్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన తైబజార్ వేలం పాటలు ఈ ఏడాది భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. నవీపేట్, బోధన్, రుద్రూర్ వంటి ప్రాంతాల్లో భారీగా రూ.లక్షల్లో ధరలు పలికాయి. పెరిగిన పోటీతో స్థానిక సంస్థల ఖజానాకు భారీగా నిధులు సమకూరడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులను పట్టణ, గ్రామ అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు.

News April 8, 2026

కరెంట్ అఫైర్స్ (08-04-2026)

image

☛ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ISSF) వరల్డ్ కప్‌లో భారత షూటర్లు పాలక్, ముకేశ్ నెలవల్లికి గోల్డ్ మెడల్
☛ ఒరాకిల్ కొత్త CFOగా హిలరీ మాక్సన్.. టోటల్ ప్యాకేజ్ ₹276కోట్లు
☛ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్‌గా తమీమ్ ఇక్బాల్
☛ తమిళనాడు తండ్రి-కుమారుల లాకప్ డెత్ కేసు(2020).. 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించిన మదురై కోర్టు
☛ US, ఇరాన్ మధ్య 14 రోజుల సీజ్‌ఫైర్.. మధ్యవర్తిగా పాక్

News April 8, 2026

వెనిజులా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు!

image

వెనిజులా నుంచి 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు ఈ నెలలోనే ఇండియాకు రానుంది. 2020 ఫిబ్రవరి తర్వాత ఆ దేశం నుంచి ఈ స్థాయిలో ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవల 1 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్‌తో సూయజ్‌మ్యాక్స్ నౌక గుజరాత్‌లోని సిక్కా పోర్టుకు చేరుకుంది. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో కొన్నిరోజులుగా సరఫరా నెమ్మదించింది. ఈ క్రమంలో దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా వెనిజులా నుంచి దిగుమతులను ఇండియా పెంచుకుంటోంది.