News March 10, 2026
అల్లూరి జిల్లాలో ‘నిర్మాణ్’ పేరుతో విద్యా వ్యూహం

అల్లూరి జిల్లాలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘నిర్మాణ్’ పేరుతో చేపట్టిన ఈ విద్యా వ్యూహం గురించి కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం విశాఖలో జరిగిన నీతి ఆయోగ్ ప్రాంతీయ సెమినార్లో వివరించారు. 3నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల్లో ప్రాథమిక చదువు, గణిత నైపుణ్యాలను పెంపొందించి, ప్రత్యేక ప్రోత్సహం అందించడం జరుగుతుందన్నారు.
Similar News
News March 10, 2026
కాకినాడ: నాటు తుపాకీ కాల్పులతోనే బాలుడు మృతి..!

అనకాపల్లి(D) ఎలమంచిలి(M) ఏటికొప్పాకలోని కొండల్లో అనుమానదస్పదంగా మరణించిన <<19334335>>కౌశిక్ <<>>నాటు తుపాకీ కాల్పులతో చనిపోయినట్లు సమాచారం. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి నాటు తుపాకీతో అడవిలో వేటాడే అలవాటు ఉంది. ఆ వ్యక్తి కుమారుడు, కౌశిక్ ఈ తుపాకీతో ఆడుకుంటున్న క్రమంలో తుపాకీ పేలి మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాకినాడ(D) తునికి చెందిన కౌశిక్ ఏటికొప్పాకలో మేనమామల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు.
News March 10, 2026
కరీంనగర్: జల్సాల కోసం గేదెను ఎత్తుకెళ్లారు!

జల్సాలకు అలవాటు పడి పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షేడ్‌కు చెందిన నేరెళ్ల ప్రవీణ్, మేడ మహేశ్, మొగిలి శంకర్ ఇటీవల నల్లగుంటపల్లిలో స్వామి అనే రైతుకు చెందిన గేదెను దొంగిలించారు. నిందితులను బొమ్మకల్ వద్ద అదుపులోకి తీసుకుని, రూ.55 వేల విలువైన గేదెను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
News March 10, 2026
KTDM: పరిశ్రమలు మూత.. నిరుద్యోగుల ఆందోళన

భద్రాద్రి జిల్లాలో పరిశ్రమలు మూతపడుతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జలగం వెంగళరావు హయాంలో ఏర్పాటైన పరిశ్రమలే నేటికీ ఆధారంగా ఉన్నాయి. కొత్త పరిశ్రమల స్థాపన లేకపోవడం, ఉన్న వాటికి ప్రభుత్వ సహకారం కరువవ్వడంతో జిల్లా వెనుకబడింది. ఎస్సీసీఎల్, కేటీపీఎస్ వంటి సంస్థలే దిక్కుగా మారగా, ఉపాధి దొరక్క యువత నగరాల బాట పడుతున్నారు. పారిశ్రామికాభివృద్ధిపై పాలకులు దృష్టి సారించాలని కోరుతున్నారు.


