News March 26, 2025

అల్లూరి జిల్లాలో పరీక్షలకు 101 మంది దూరం

image

అల్లూరిలో బుధవారం జరిగిన 10వ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్షకు 101 మంది గైర్హాజరు అయ్యారని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,606 మంది విద్యార్థులు రాయవలసి ఉండగా 11,505 మంది హాజరయ్యారని తెలిపారు. 99 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో 8 పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.  మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

Similar News

News September 16, 2025

కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

image

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.

News September 16, 2025

HYD: పడితే కుటుంబాలు రోడ్డున పడతాయ్!

image

ట్రాలీ నిండా సామాన్లు.. పైన కట్టెలు.. వాటిపైనే ప్రాణాలను ఫణంగా పెట్టిన కూలీలు. అదుపు తప్పితే వారితో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని మరిచిపోతే ఎలా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా నియమాలను పాటించాలని పోలీసులు చెబుతుంటే పెడచెవిన పెట్టి ప్రమదాలకు గురవుతున్నారు. ఫైన్‌లు వేసినా భయం లేదు. ఈ దృశ్యం పీర్జాదిగూడ పర్వతాపూర్‌లో కనిపించింది. ఇలాంటి ప్రయాణాలు విషాదాంతంగా మారుతాయని గుర్తించండి.

News September 16, 2025

కలెక్టర్ల సమావేశానికి హాజరైన అనంత కలెక్టర్

image

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు మంగళవారం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.