News December 1, 2025
అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

అల్లూరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో వాతావరణం మారింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి తదితర మండలాల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా ముసురు వాతావరణం కొనసాగుతుంది. అయితే కొయ్యూరు తదితర మండలాల్లో వరిపంట పండిపోయి కోత దశలో ఉంది. కొన్నిచోట్ల రైతులు పంట కోతలు కోస్తున్నారు. వర్షం పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
Similar News
News April 13, 2026
NGKL: జిల్లాలో పెరుగుతున్న ఎండలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సిర్సనగండ్ల, పెద్దకొత్తపల్లిలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, జటప్రోలు, లింగాల తదితర ప్రాంతాల్లోనూ పార 41 డిగ్రీలు దాటింది. భానుడి భగభగలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావడం లేదు.
News April 13, 2026
CMR జడ్జి కోర్టులో ఘనంగా పద్మం సిల్వర్ జువెలరీ ప్రారంభం

పద్మం సిల్వర్ జువెలరీ వారి మరొక శాఖను జడ్జి కోర్టు ఎదురుగా గల CMR షాపింగ్ మాల్‌లో CMR గ్రూపు సంస్థల డైరెక్టర్ మావూరి బాలాజీ, సతీమణి హారికతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఒక లక్ష రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలుపై రూ.50 వేల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా,రూ.50 వేల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలుపై రూ.25 వేల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా అందిస్తున్నామన్నామని బాలాజీ తెలిపారు.
News April 13, 2026
నిర్మల్: ఒకే గ్రామం నుంచి ఇద్దరు టాపర్లు..!

మామడ మండలం కొరిటికల్ గ్రామం ఇంటర్ ఫలితాల్లో విద్యానగరిగా మారింది. సామల హర్షిత ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 996/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వినీష ప్రథమ సంవత్సరంలో 469/470 మార్కులతో సత్తా చాటింది. ఒకే గ్రామం నుంచి ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడంతో గ్రామస్థులు సంబరాలు జరుపుకుంటున్నారు.


