News April 1, 2025

అల్లూరి జిల్లాలో పసిబిడ్డను ఎత్తుకెళ్లింది ఈమనే..! 

image

అల్లూరి జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల మగ బిడ్డ మంగళవారం మాయమయ్యాడని స్థానికులు తెలిపారు. వై.రామవరం మండలం పాముగంటి వాసి కళావతికి 5 రోజుల క్రితం బిడ్డ పుట్టాడు. పచ్చకామెర్లు ఉన్నాయని ఇంక్యుబేటర్‌లో ఉంచాలని నమ్మించిన ఓ మహిళ బాబును ఎత్తుకెళ్లిందని చెప్పారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది సీసీ పుటేజ్‌ను పరిశీలించారు.ఆ మహిళ చిత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 28, 2026

NRPT: మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ

image

మీసేవ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు మొబైల్ యాప్‌ను విధిగా వినియోగించాలని నారాయణపేట అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జీపీఓలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ యాప్ వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

News February 28, 2026

బాపట్లలో పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

బాపట్ల మున్సిపాలిటీలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పెన్షన్లు సమయానికి, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో, తహశీల్దార్ ఉన్నారు.

News February 28, 2026

పెళ్లి రోజు వర్షం పడితే అశుభమా?

image

పెళ్లి రోజు వాన పడటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘వర్షాన్ని స్వచ్ఛత, శ్రేయస్సు, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా భావిస్తారు. వివాహ సమయంలో వర్షం కురిస్తే ఆ నూతన వధూవరులు అదృష్టవంతులని, వారు జీవితాంతం సిరిసంపదలతో, సంతానంతో కలకాలం సంతోషంగా ఉంటారని నమ్మకం. ఇది వారి కొత్త జీవితంలో ఎదుగుదలకు, శుభారంభానికి సంకేతం. అయితే ఈ విషయాలు విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయని గమనించాలి’ అంటున్నారు.