News March 24, 2025

అల్లూరి జిల్లాలో పిడుగుపాటుకు అవకాశం 

image

అల్లూరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెట్లు, పొలాల్లో, టవర్స్ కింద ఉండరాదని హెచ్చరించారు. పాడేరు, డుంబ్రిగుడ, హుకుంపేట, మాడుగుల, గంగవరం, గూడెం, అనంతగిరి, అరకు, చింతపల్లి మండలాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Similar News

News July 4, 2025

వరంగల్ పోక్సో కోర్టు పీపీగా వెంకటరమణ

image

వరంగల్ జిల్లా పోక్సో కోర్టు నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గంప వెంకటరమణ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2007లో లా పట్టా పొంది, జిల్లా న్యాయస్థానాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రమణకు ఈ అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

News July 4, 2025

పాలమూరు: కొత్త రేషన్ కార్డ్.. ఇలా చేయండి!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరు, పేర్లు చేర్చడంపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే మొదట సంబంధిత తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తల్లిదండ్రుల కార్డుల నుంచి పేర్లను తొలగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News July 4, 2025

ఇసుక అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టాలి: కలెక్టర్

image

అక్రమ ఇసుక తవ్వకాలు పూర్తిగా అరికట్టాలని కమిటీ సభ్యులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత వర్షాకాలంలో స్టాక్ యార్డుల ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు.