News March 16, 2025
అల్లూరి జిల్లాలో ప్రతీ కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్: DEO

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 71 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలో ఏర్పాట్లులను శనివారం ఆయన పరిశీలించి, టీచర్స్‌కు సూచనలు ఇచ్చారు. ప్రతీ కేంద్రంలో ఒక గెజిటెడ్ ఆఫీసర్, మరో సహాయ అధికారి సిట్టింగ్ స్క్వాడ్‌గా జిల్లా కలెక్టర్ నియమించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510మంది ఇన్విజిలేటర్లుని నియమించామన్నారు.
Similar News
News March 16, 2025
మండపేట: మాజీ మున్సిపల్ ఛైర్మన్ తల్లి మృతి

మండపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ మాతృమూర్తి చుండ్రు అనంతలక్ష్మి (70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజులు క్రితం గుండె సంబంధిత సమస్యలు తలెత్తగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటలు సమయంలో ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులను పిలిపించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News March 16, 2025
టీమ్‌ను మార్చినా ఓటమి తప్పలేదు

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌తో సహా పలువురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన పాకిస్థాన్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. NZతో తొలి టీ20లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. యువ ఆటగాళ్లు విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 91కి ఆలౌటైంది. న్యూజిలాండ్ 10.1 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది. NZ గడ్డపై పాక్‌కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్.
News March 16, 2025
అనంత జిల్లాలో చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. మటన్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గుత్తిలో కేజీ మటన్ ధర రూ.750 పలుకుతోంది. అనంతపురంలో కేజీ చికెన్ ధర రూ.150 ఉండగా, గుత్తిలో కేజీ చికెన్ ధర రూ.170 నుంచి రూ.180కి కొంటున్నారు. గుంతకల్లులో కేజీ చికెన్ రూ.150 నుంచి రూ.160 ధర పలుకుతోంది. బర్డ్ ఫ్లూ కారణంగా గతవారం చికెన్ ధరలు తగ్గాయి.