News November 16, 2025

అల్లూరి జిల్లాలో బిర్సా ముండా విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ఒడిశా CM

image

AP: ఒడిశా సీఎం మోహన్ చరణ్ ఇవాళ అల్లూరి జిల్లాలో పర్యటించారు. గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకుని లగిశపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మోహన్ చరణ్‌కు రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సంధ్యారాణి, BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్‌ స్వాగతం పలికారు. స్థానిక గిరిజనులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బిర్సా ముండా వీరత్వాన్ని కొనియాడారు.

Similar News

News March 29, 2026

అందం, ఆరోగ్యం.. కర్బూజతో సొంతం

image

ఎండా కాలంలో అధికంగా లభించే కర్బూజలో 95% నీరు, విటమిన్ A, C, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. ‘BP అదుపులో ఉండి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. చర్మంపై ముడతలు తగ్గి సహజమైన కాంతి వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News March 29, 2026

ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు US సిద్ధం!

image

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరనుంది. ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు వేలాది <<19503626>>US సైనికులు<<>> అక్కడికి చేరుకుంటున్నారు. ఖర్గ్ ద్వీపం, హార్ముజ్ జలసంధి సమీపంలోని స్థావరాలపై కొన్ని వారాలపాటు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అయితే దీనికి ట్రంప్ అనుమతిచ్చారా లేదా అనేది క్లారిటీ లేదంది. ఆ ఆపరేషన్ పూర్తిస్థాయి దండయాత్రలా కాకుండా వ్యూహాత్మకంగా ఉంటుందని పేర్కొంది.

News March 29, 2026

MEGA158.. ఊర మాస్ లుక్‌లో చిరు?

image

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ-చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా(MEGA158) షూటింగ్ APR 20న ప్రారంభం కానున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మూవీ ఉంటుందని, ఊర మాస్ లుక్‌లో మెగాస్టార్ కనిపిస్తారని టాలీవుడ్ టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి, చిరు కూతురుగా అనశ్వరా రాజన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.