News March 28, 2025
అల్లూరి జిల్లాలో భానుని ప్రతాపం

అల్లూరి జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అడ్డతీగల, చింతూరు, దేవీపట్నం, గంగవరం, కొయ్యూరు, కూనవరం, రాజవొమ్మంగి, రంప, వీఆర్ పురంలో రాబోయే 48 గంటలు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కానుంది. దీంతో ఆ మండల వాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News March 31, 2025
SRH.. బౌలింగ్‌లో రైజ్ అవ్వరా?

గత సీజన్లో భారీ స్కోర్లతో అలరించిన SRH ఈ సారి రెట్టించి ఆడుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. తొలి మ్యాచులో అంచనాలను అందుకున్నా తర్వాతి రెండింట్లో విఫలమైంది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌లో సత్తా చాటలేకపోతుంది. చివరి 2 మ్యాచుల్లోనూ ప్రత్యర్థి 4-5 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ఆ బలహీనతను బయటపెడుతోంది. ఇలా అయితే 300 కొట్టినా లాభం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News March 31, 2025
రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

సన్న బియ్యం పథకాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించాలన్న CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. అయితే BRS ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ సర్కారు కొనసాగించాలని డిమాండ్ చేశారు. KCR బీసీ బంధు, దళితులకు రూ.పది లక్షలు వంటి పథకాలను ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. సంప్రదాయాలను KCR గౌరవించేవారని, ప్రస్తుతం ఉన్న సీఎం కూడా పాటించాలని హరీశ్ సూచించారు.
News March 31, 2025
బాపట్ల జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

బాపట్ల జిల్లాలో రంజాన్ సందడి మొదలైంది. ముస్లింల పరమ పవిత్రమైన రంజాన్ రోజు మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. ప్రజలు భారీ సంఖ్యలో మాంసం విక్రయం కోసం బారులు తీరారు. కాగా జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ధరలు అటూ ఇటుగా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి KG రూ.280 ఉండగా.. మటన్ కిలో ధర 800, నాటుకోడి ధర KG రూ.500గా ఉంది. నిన్న బాపట్ల సహా పలు ప్రాంతాల్లో KG రూ.180 ఉన్న చికెన్ ధర నేడు అమాంతం రూ.100కు పెరిగింది.