News February 14, 2025

అల్లూరి జిల్లాలో రూ.135కోట్ల బకాయిలు: ఎస్ఈ

image

అల్లూరి జిల్లాలో దాదాపుగా రూ.135కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని APEPDCL ఎస్ఈ ప్రసాద్ అన్నారు. వాటిని వసూలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.  వై.రామవరం విద్యుత్ సబ్ స్టేషన్‌ను శుక్రవారం పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లాలో అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిని గుర్తించి 160 కేసులు నమోదు చేశామని తెలిపారు.

Similar News

News July 7, 2025

వికారాబాద్‌కు 10,657 రేషన్ కార్డులు మంజూరు

image

ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజల కష్టాలు దూరం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,657 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఆయా రేషన్ కార్డుల్లో మొత్తం 88,374 మంది కుటుంబీకులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు రావడంతో జిల్లాలో 506 మెట్రిక్ టన్నుల బియ్యం కోట పెరిగింది. ఈనెల 14న CM రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన తర్వాత జిల్లాలో ప్రజాప్రతినిధులు రేషన్ కార్డులు అందజేయనున్నారు.

News July 7, 2025

నూజివీడు IIITలో 141 సీట్లు ఖాళీ

image

నూజివీడు IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల ఇటీవల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 869 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 141 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.

News July 7, 2025

ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ బోనకల్, వైరా మండలాల్లో నేడు విద్యుత్ నిలిపివేత
☆ వేంసూర్లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
☆ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం
☆ నేడు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
☆ ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమం
☆ జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యటన
☆ వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు