News December 28, 2025
అల్లూరి జిల్లాలో విషాదం.. తండ్రీకొడుకుల మృతి

అల్లూరి జిల్లా కూనవరం మండలం నర్సింగపేటలో ఆదివారం ప్రమాదం జరిగింది. కోడిపుంజుతో ఈత కొట్టించే ప్రయత్నంలో తండ్రీకొడుకులు సింహాద్రి అప్పారావు (42), జస్వంత్ (14) వ్యవసాయ నీటి గుంతలో పడి మృతి చెందారు. ఆశ్రమ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Similar News
News December 29, 2025
వైకుంఠ ఏకాదశి రోజున ఆ పని చేయకూడదు.. ఈరోజే చేసుకోండి!

రేపు వైకుంఠ ఏకాదశి. ఇది అతి పవిత్రమైన రోజు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ పర్వదినాన తులసి ఆకులను కోయడం నిషిద్ధం. తులసి కోటను ముట్టడం, ఆకులు తెంపడం మంచిది కాదు. అందుకే స్వామికి రేపు సమర్పించాల్సిన తులసి దళాలను ఈరోజే కోసి సిద్ధం చేసుకోండి. తులసి ఎప్పుడు తెంపినా వాటి పవిత్రత తగ్గదు. నిశ్చింతగా పూజకు వాడుకోవచ్చు. నియమాలు పాటిస్తూ భక్తితో ఆ శ్రీహరిని స్మరించి, అర్చించి మోక్షాన్ని పొందండి.
News December 29, 2025
భార్య సూసైడ్.. వెయ్యి కిలోమీటర్లు పారిపోయి..

బెంగళూరులో కొత్త జంట ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సూరజ్ శివన్న(35), గన్వీ(25) ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో గన్వీ ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో 1000KM దూరంలోని నాగ్‌పూర్(MH)కు సూరజ్, అతడి తల్లి పారిపోయారు. ఒత్తిడి తట్టుకోలేక సూరజ్ ఉరేసుకున్నాడు. అతడి తల్లి ఆత్మహత్యకు యత్నించింది. అత్తింటి వేధింపులతోనే గన్వీ చనిపోయిందని ఫ్యామిలీ ఆరోపిస్తోంది.
News December 29, 2025
ధనుర్మాసం: పద్నాలుగో రోజు కీర్తన

‘సఖీ! అందరినీ లేపుతానన్న వాగ్దానం మరిచి నిద్రిస్తున్నావా? తెల్లవారింది, కలువలు విచ్చుకున్నాయి. మునులు, యోగులు గుడి తలుపులు తీసేందుకు తాళాలతో వెళ్తున్నారు. ఇవన్నీ ఉదయానికి సూచనలే కదా! పంకజాక్షుడైన ఆ కృష్ణుని శంఖచక్రాల సౌందర్యాన్ని, ఆయన గుణగణాలను మనమంతా కలిసి కీర్తించాలి. నీవు వెంటనే మేలుకో, గోష్టిగా సంకీర్తన చేస్తేనే మన వ్రతం ఫలిస్తుంది” అంటూ గోదాదేవి తొమ్మిదవ గోపికను మేల్కొలుపుతోంది. <<-se>>#Dhanurmasam<<>>


