News February 23, 2025

అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలు

image

అల్లూరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 26పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్మీడియట్ జిల్లా విద్యా అధికారి అప్పలరాము శనివారం తెలిపారు. పాడేరు డివిజన్‌లో 16, రంపచోడవరంలో 6, చింతూరులోని 4 కేంద్రాల్లో 76 కళాశాలల నుంచి మొత్తం 14,720మంది పరీక్షలు రాస్తారన్నారు. మార్చి 1నుంచి 20వరకు వరకు పరీక్షలు జరుగుతాయాన్నారు. హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.

Similar News

News September 19, 2025

మ‌న జీవితం బాధ్యత మ‌న‌దే: సాయి దుర్గ తేజ్‌

image

TG: హెల్మెట్ ధరించడం వల్లే తాను ప్రాణాలతో బయటపడినట్లు హీరో సాయి దుర్గ తేజ్ పేర్కొన్నారు. HYD పోలీసులు నిర్వహించిన ‘ట్రాఫిక్ స‌మ్మిట్ 2025’కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ‘హెల్మెట్ ధ‌రించ‌ని వాళ్ల‌కి, తాగి బండి న‌డిపేవాళ్ల‌కి చిన్న ప‌నిష్మెంట్ ఇస్తే వారికి జీవితాల‌పై మ‌రింత బాధ్య‌త పెరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్ మాత్ర‌మే’ అని తెలిపారు. ఆయ‌న‌ పోలీస్ శాఖ‌కు రూ.5 ల‌క్ష‌లు విరాళాన్ని ఇచ్చారు.

News September 19, 2025

సెప్టెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

✒ 1887: రచయిత, నాస్తికుడు తాపీ ధర్మారావు జననం
✒ 1911: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
✒ 1924: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
✒ 1960: భారత్-పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం(ఫొటోలో)
✒ 1977: క్రికెటర్ ఆకాశ్ చోప్రా జననం
✒ 1965: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ జననం

News September 19, 2025

ఒక్క రోజులోనే ఎంప్లాయ్మెంట్ కార్డు: సాహితీ

image

యువతకు ఎంప్లాయిమెంట్ కార్యాలయం జారీ చేసే ఎంప్లాయిమెంట్ కార్డు తప్పనిసరని జిల్లా ఉపాధి అధికారిణి సాహితీ తెలిపారు. గతంలో కార్డు మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ఒక్కసారి కార్డు తీసుకుంటే ఇక శాశ్వతంగా ఉంటుందన్నారు. మీసేవ కేంద్రాలు, ఫోన్ నుంచి employment.telangana.gov.inలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే కార్డు జారీ చేస్తామని వెల్లడించారు.