News March 5, 2025
అల్లూరి జిల్లాలో 650 మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 650మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అప్పలరాం తెలిపారు. జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్షకు 6, 773 మంది హాజరు కావాల్సి ఉందన్నారు. 6,324 మంది పరీక్షలు రాశారని.. 449మంది ఆబ్సెంట్ అయ్యారని చెప్పారు. 8 కేంద్రాల్లో 1,355మందికి 1,154 మంది ఒకేషనల్ పరీక్ష రాశారని చెప్పారు. 201 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News December 19, 2025
ప్రకాశంలో పెద్ద మిస్టరీ.. 38408 కార్డుల కథేంటి..?

ప్రకాశం జిల్లాలో 38408 స్మార్ట్ రేషన్ కార్డుల యాజమానుల కోసం ఎదురుచూపుల్లో ఉన్నాయని అధికారుల వద్ద ఉన్న లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోనియెడల త్వరలో సరెండర్ చేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు.
News December 19, 2025
KNR: ఉన్నత చదువులకు కస్తూర్బా బాట..!

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం చూపుతున్నాయి. ఇంటర్‌తో ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి KNRలో శంకరపట్నం, రామడుగు, మర్రిపల్లి, సిరిసిల్ల, తంగళ్లపలి, రామగుండం, జూలపల్లి, సుల్తానాబాద్, కోరుట్ల, జగిత్యాల, ఇబ్రహీంపట్నం కేజీబీవీల్లో ఈ శిక్షణను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు.
News December 19, 2025
పెద్దపల్లి: పలు సూపర్ ఫాస్ట్ రైళ్ల రాకపోకలు ఆలస్యం

నార్త్ ఇండియాలో అధిక పొగమంచు కారణంగా గురువారం బయలుదేరిన పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయని SCR అధికారులు తెలిపారు. T.No.22692 నిజాముద్దీన్→KSR బెంగళూరు రాజధాని SF 5.30Hrs, T.No.20806న్యూఢిల్లీ→విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ SF 7Hrs, T.No.12622 న్యూఢిల్లీ→MGR చెన్నై తమిళనాడు SF 6Hrs, T.No.12626 న్యూఢిల్లీ→తిరువనంతపురం కేరళ SF 9Hrs, T.No.12722 నిజాముద్దీన్→హైద్రాబాద్ దక్షిణ్ SF 5Hrs.


