News October 30, 2025
అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పంకజ్ కుమార్ మీనా

చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా నియమితులయ్యారు. ఈమేరకు DGP హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పంకజ్ కుమార్ మీనా చింతూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలన, మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణకు విశేష కృషి చేశారు.
Similar News
News October 31, 2025
వెడ్డింగ్ సీజన్: ₹6.5 లక్షల కోట్ల వ్యాపారం.. కోటి ఉద్యోగాలు

నవంబర్ 1 నుంచి వెడ్డింగ్ సీజన్ మొదలు కాబోతోంది. 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) రీసెర్చ్ అంచనా వేసింది. ఈ పెళ్లి వేడుకలతో రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపింది. కోటి ఉద్యోగాలు జెనరేట్ అవుతాయని వెల్లడించింది. 2024లో 48 లక్షల పెళ్లిళ్లు, 5.9 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు వివరించింది.
News October 31, 2025
అక్టోబర్ 31: చరిత్రలో ఈరోజు

1875: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం
1895: IND టెస్ట్ టీమ్ తొలి కెప్టెన్ CK.నాయుడు జననం
1975: సంగీత దర్శకుడు ఎస్‌డీ బర్మన్ మరణం
1984: మాజీ PM ఇందిరా గాంధీ మరణం
1990: గాయని ML.వసంతకుమారి మరణం
2022: పారిశ్రామికవేత్త జేజే ఇరానీ మరణం
* జాతీయ ఐక్యతా దినోత్సవం (వల్లభ్‌భాయ్ జయంతిని కేంద్రం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతోంది)
News October 31, 2025
పెళ్లి చేసుకున్న నారా రోహిత్, నటి శిరీష

టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి శిరీష వివాహం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. AP CM చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ తదితరులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రోహిత్, శిరీష ‘ప్రతినిధి-2’ సినిమాలో జంటగా నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వివాహబంధంతో ఒక్కటయ్యారు.


